తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఔటర్ వద్ద విద్యుత్ వైర్లు తెగిపడటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా గుంటూరురేపల్లె రైలు తెనాలి స్టేషన్ ఔటర్ వద్ద నిలిచిపోయింది. మరికొన్ని రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఔటర్ వద్ద విద్యుత్ వైర్లు తెగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో గుంటూరురేపల్లె రైలు తెనాలి స్టేషన్ ఔటర్ వద్ద నిలిచిపోయింది. దీని ప్రభావంతో మరికొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు చేపట్టారు.
అదృష్టవశాత్తు వైర్లు తెగిపడిన సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.












