మధిర మండల పరిధిలోని విజయవాడ రోడ్డు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తికి గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదం నిదానపురం క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి బైకు సెల్ఫ్ ప్రమాదానికి గురయ్యాడు.
గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం కోసం ప్రజలను కోరుతున్నారు.
మధిరరూరల్ పోలీస్ స్టేషన్కు సంప్రదించవచ్చని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆచూకీ తెలిసిన వారిని సంప్రదించమని పోలీసులు సూచిస్తున్నారు.


