దళిత, గిరిజన ప్రజల అభివృద్ధి, సంక్షేమం, హక్కులకు సంబంధించి ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు, పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా చర్చించేందుకు దళిత-గిరిజన బడ్జెట్ ఆధ్వర్యంలో బాపట్లలో జిల్లా స్థాయి చర్చా వేదిక నిర్వహించనున్నారు.
ఈ నెల 23వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య మీటింగ్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. 2026-27 బడ్జెట్లో దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులు, వాస్తవంగా జరిగిన ఖర్చులు, వాటి అమలు పరిస్థితులపై చర్చించనున్నారు.
గురుకుల పాఠశాలలు, వసతి గృహాలపై చర్చ
గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న విద్య, భోజనం, వసతి, ఆరోగ్యం, భద్రత తదితర అంశాలపై చర్చించడంతో పాటు సంబంధిత బాధ్యతలపై కూడా విశ్లేషణ చేయనున్నారు.
భవిష్యత్ కార్యాచరణపై చర్చ
డా. బి.ఆర్. అంబేడ్కర్ నాయకత్వంలో జరిగిన మహాద్ చెరువు నీటి హక్కు ఉద్యమానికి 100 సంవత్సరాల స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి ఒక్కరికీ సమానమైన తాగునీటి హక్కు, గౌరవం, సామాజిక న్యాయం కోసం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనుంది.
దళిత-గిరిజన సంక్షేమం, సామాజిక న్యాయం, హక్కుల కోసం పనిచేస్తున్న ప్రజా సంఘాలు, పౌర సమాజ సంస్థలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చర్చా వేదికకు హాజరై తమ అభిప్రాయాలు, అనుభవాలు, సూచనలు పంచుకోవాలని నిర్వాహకులు కోరారు.
సంప్రదించాల్సిన వివరాలు
డి. డేవిడ్ రాజు జిల్లా చైర్మన్, బడ్జెట్ , బాపట్ల: 9346370610 ఎన్. శ్రీలత ఏరియా కోఆర్డినేటర్, బాపట్ల: 7286054555 వి. భగవాన్ దాస్ జిల్లా కన్వీనర్, బడ్జెట్ , బాపట్ల: 7288882191


