జె.పంగులూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) ఆగస్టు 15
యశఖనధయసనన,నూజసనఎననయన,నననధనషసధయషనీన.ీనధససెనషన,శనయనశ.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలో దళితులకు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యం కూడా లేదని, విగ్రహాన్ని అక్రమంగా అరెస్టు చేసి పంగులూరు తహసిల్దార్ కార్యాలయంలో నిర్బంధించడం మంత్రి ఫ్యూడలిజానికి నిదర్శనమని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు తీవ్రంగా విమర్శించారు. గత సంవత్సరం నుంచి జె. పంగులూరు మండలం నూజిల్లపల్లి గ్రామంలో మాలపల్లికి వెళ్లే దారిలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలని, అలాగే పల్లె రహదారికి ఆర్చి నిర్మించుకోవాలని దళితులు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.
అగ్రకుల అహంభావంతో అడ్డుకుంటున్నారని ఆరోపణ
అయితే, ఈ దళితుల రాజ్యాంగ హక్కును అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కనుసన్నల్లో గ్రామ, మండల తెలుగుదేశం నాయకులు అగ్రకుల అహంభావంతో అడ్డుకుంటున్నారని నాగేంద్రరావు ఆరోపించారు. గత అంబేద్కర్ జయంతి నాడు కూడా ప్రభుత్వ పోరంబోకు స్థలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఫ్లెక్సీని ఆ గ్రామస్తులు అడ్డుకొని అరాచకం సృష్టించారని ఆయన పేర్కొన్నారు.
పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కాలేదని ఆరోపణ
అంబేద్కర్ పట్ల జరిగిన ఈ అంటరాని ఘటనపై స్థానిక వేణంగివరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదని, అప్పటినుండి అంబేద్కర్ విగ్రహం, ఆర్చి ఏర్పాటు వివాదం రగులుతూనే ఉందని నాగేంద్రరావు తెలిపారు. ఇటీవల స్థానిక దళితులు నూజిల్లపల్లిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోగా, వారిని అక్రమంగా అరెస్టు చేసి రేణంగివరం పోలీస్ స్టేషన్ లో దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ, అద్దంకి సీఐ సుబ్బరాజు, పంగులూరు తహసిల్దార్ సింగారావు నిర్బంధించారని ఆయన ఆరోపించారు.
విగ్రహాన్ని తహసిల్దార్ కార్యాలయంలో పక్కన పడేశారని ఆరోపణ
అంతేకాకుండా, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పంగులూరు తహసిల్దార్ కార్యాలయానికి తరలించి పక్కన పడేశారని నాగేంద్రరావు ఆరోపించారు. నూజిల్లపల్లి దళితులు గత సోమవారం ఒంగోలు జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేయగా, జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆర్డీవో, డిఎస్పీలను పంపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ వారం గడుస్తున్నా ఆర్డీవో గానీ, డిఎస్పీ గానీ నూజిల్లపల్లి వైపు కన్నెత్తి చూడలేదని ఆయన విమర్శించారు.
అధికారుల సస్పెన్షన్ కు డిమాండ్
నూజిల్లపల్లి దళితుల న్యాయమైన రాజ్యాంగ హక్కులు, అంబేద్కర్ విగ్రహం, ఆర్చి ఏర్పాటు విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకుంటే విద్యుత్ శాఖ మంత్రి షాక్ కు గురయ్యే పరిస్థితి వస్తుందని అద్దంకి ఆర్డీవో, దర్శి డిఎస్పీ భయపడుతున్నారని భావిస్తున్నట్లు నాగేంద్రరావు పేర్కొన్నారు. కావున జిల్లా కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు నూజిల్లపల్లి గ్రామాన్ని సందర్శించి అంబేద్కర్ విగ్రహం, దళితుల ఆర్చి ఏర్పాటుకు ఆదేశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం నూజిల్లపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. నూజిల్లపల్లి గ్రామ దళిత పెద్దలతో మాట్లాడారు. తదనంతరం అద్దంకి ఆర్డీవో, దర్శి డిఎస్పీలు జె.పంగులూరు మండల కార్యాలయంలో నిర్బంధించిన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు.












