చిన్నగంజాం తహసీల్దార్ కార్యాలయంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చిన్నగంజాం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సాధన కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. సత్యం, అహింసా సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహనీయుడని ఆయన తెలిపారు.
గాంధీజీ ఆశయాలు నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించడం, నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించడం ద్వారా గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు.








