చీరాల: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, చీరాల ఎన్.ఆర్ పీ.ఎం. బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన పారువేట కార్యక్రమానికి చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు, చీరాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ ఇస్తర్ల షెర్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పారువేట కార్యక్రమంలో పాల్గొని, వేడుకలను తిలకించారు.
విజయదశమి పర్వదినం సందర్భంగా నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాల్లో పారువేటకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ వేడుకల్లో భాగంగా స్థానికంగా పండుగ సందడి నెలకొంది. కార్యక్రమానికి హాజరైన కరణం వెంకటేష్ బాబు, డాక్టర్ ఇస్తర్ల షెర్లి వెంట వివిధ హోదాల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.












