చీరాల, 2026-08-10
చీరాల పట్టణంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు చేపట్టారు. పేరాల శివాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సభ్యులు పాల్గొన్నారు.

అన్నదానం, గోశాల సేవ
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి రెండు బస్తాల బియ్యాన్ని అన్నదాత పాండురంగారావు, గోలి మల్లికార్జునులకు అందజేశారు. అలాగే దివ్వెల నాగేంద్ర ప్రసాద్ సహకారంతో గోశాల నిర్వాహకులకు రూ.4,000 నగదును అందించారు.
శానిటరీ వర్కర్లకు వస్త్రాలు
అనంతరం గ్రౌండ్లో విధులు నిర్వహిస్తున్న నలుగురు మునిసిపల్ శానిటరీ వర్కర్లకు నూతన వస్త్రాలను బహూకరించారు. వాకింగ్ అసోసియేషన్ సభ్యుల కోసం స్వీట్, హాట్, అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు.
అధ్యక్షుడికి సన్మానం
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు చారగుళ్ల గురుప్రసాద్, సుధాకరరావు, మధుసూదనరావు, శీరాం రమేష్, సుబ్బారావు, నారాయణమూర్తి, అమరా నాగేశ్వరరావు, పూర్ణ, శ్రీనివాసరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.