ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వరుసు ఆంజనేయులు గారి అకాల మరణంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (HRCI) ఆదుకుంది.
వరుసు ఆంజనేయులు గారి మరణం అనంతరం, ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను స్థానిక హెచ్.ఆర్.సి.ఐ సభ్యులు సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన హెచ్.ఆర్.సి.ఐ ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రామిశెట్టి శ్రీరాం, జిల్లా మహిళా వింగ్ ప్రతినిధి గొల్లపూడి నాగమల్లిక గోపాలపురం గ్రామానికి వెళ్లి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.
ఆపత్కాలంలో ఆసరాగా నిలుస్తూ, హెచ్.ఆర్.సి.ఐ ప్రతినిధులు బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా 100 కేజీల బియ్యాన్ని అందజేశారు. భవిష్యత్తులోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.
తమ కష్టకాలంలో అండగా నిలిచి, తక్షణ సాయం అందించిన హెచ్.ఆర్.సి.ఐ ప్రతినిధులకు, సభ్యులందరికీ బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెచ్.ఆర్.సి.ఐ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.








