బాపట్ల జిల్లా రామాపురంలో ఆదివారం శక్తి టీం అవగాహన కార్యక్రమం జరిగింది, ఇందులో సముద్రానికి వచ్చిన ప్రజలకు శక్తి యాప్ పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం బాపట్ల జిల్లా IPS బి ఉమామహేశ్వర్ గారి ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ DSP మోయిన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. శక్తి టీం సభ్యులు, ఎస్సై ఏ హరిబాబు మరియు లేడీ కానిస్టేబుల్ సిహెచ్ సునీతా, సముద్రానికి వచ్చిన మహిళలు మరియు చిన్నారులతో కలిసి శక్తి యాప్ గురించి వివరించారు.
ఆపద సమయంలో శక్తి యాప్ ఎలా ఉపయోగపడుతుందో, సముద్రానికి వచ్చే వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్స్ వంటి అంశాలపై కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు శక్తి టీం సభ్యులు కృతజ్ఞతలు తెలియపరిచారు. శక్తి యాప్ హెల్ప్ లైన్ నెంబర్లు 112, 1098, 181, 1930 గురించి కూడా అవగాహన కల్పించారు.








