చీరాల, 17 September
చీరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ డిసి), స్థానిక ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సహకారంతో ఈ నెల 24వ తేదీన (గురువారం) భారీ జాబ్ మేళా నిర్వహించనుంది. వై.ఏ. ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం కానుంది.
చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ డిసి), స్థానిక ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సహకారంతో చీరాలలో ఈ నెల 24వ తేదీన (గురువారం) భారీ జాబ్ మేళా నిర్వహించనుంది. వై.ఏ. ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఇందులో 20 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. ఉద్యోగాల కోసం హాజరయ్యే అభ్యర్థులు ముందుగా ఏపీఎస్ఎస్ డిసి నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. అభ్యర్థులు తమ రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలి. ఫార్మల్ డ్రెస్ లో ఇంటర్వ్యూకు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాలకు 9100566581, 7981443777, 8555901198, 9949914337 నంబర్లలో సంప్రదించవచ్చు. ఏపీఎస్ఎస్ డిసి కమాండ్ కంట్రోల్ నంబర్లు: 9988853335, 8712655686, 8790118349, 8790117279.












