మండలం పందిళ్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలాం స్పేస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ అందే మురళీ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు.
మండలం పందిళ్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలాం స్పేస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ అందే మురళీ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక రంగాల ప్రాధాన్యతను వివరిస్తూ, దేశ రక్షణకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. రక్షణ రంగంలో శాస్త్రవేత్తల కృషి, సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యతతో పాటు విద్యార్థులకు అందుబాటులో ఉన్న వివిధ అవకాశాలను ఆయన వివరించారు.
రోటరీ క్లబ్ కార్యదర్శి, పందిళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘ సభ్యుడు పోలకం చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా రోటరీ సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. డాక్టర్ అందే మురళీ వరప్రసాద్ శాస్త్రవేత్తగా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సహచరుడిగా దేశానికి అందించిన సేవలను ఆయన కొనియాడారు.
అనంతరం డాక్టర్ అందే మురళీ వరప్రసాద్‌ను పూర్వ విద్యార్థులు, రోటరీ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ఒడిగినేని శ్రీనివాసరావు, తిరుమల రవికుమార్, గౌరవబత్తిన వెంకటేశ్వరరావు, పోలకం వాసుదేవరావు తదితరులతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.












