స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విప్లవజ్యోతి భగత్ సింగ్ కు కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం ధైర్యంగా ఆలోచించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, సమాజం పట్ల బాధ్యతగా ఉండడం వంటివి భగత్ సింగ్ జీవితం అందించే స్ఫూర్తిదాయక అంశాలని ఈ సందర్భంగా తెలిపారు.
స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విప్లవజ్యోతి భగత్ సింగ్ కు కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం ధైర్యంగా ఆలోచించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, సమాజం పట్ల బాధ్యతగా ఉండడం వంటివి భగత్ సింగ్ జీవితం మనకు అందించే ప్రధాన స్ఫూర్తిదాయక అంశాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తెలిపారు. భగత్ సింగ్ పేరు భారత యువతలో దేశభక్తి, ధైర్యం, త్యాగానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిందని ప్రధానోపాధ్యాయులు ఏ ఉమా మహేశ్వర రావు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












