## (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 24
కలిదిండి మండలం పడమటిపాలెం ఎంపీపీ పాఠశాలలో మెగా పీటీఎం (P.T.M.) 4.0 కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు టి. సూర్యలక్ష్మి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల ప్రగతి, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చర్చించారు.
కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంపీపీ పాఠశాలలో మెగా పీటీఎం (P.T.M.) 4.0 కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు టి. సూర్యలక్ష్మి అధ్యక్షతన అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశంలో విద్యార్థుల ప్రగతి, పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా ప్రమాణాలు మరియు మౌలిక వసతులపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విస్తృతంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పాము నాగరాజు, మాజీ సర్పంచ్ సానా మీనా సరస్వతి, ఎంపీటీసీ నరసింహారావు, మాజీ సర్పంచ్ పాము రవికుమార్, మరియు గ్రామ ప్రముఖులు రాజేష్, వెంకటేశ్వరరావు, శ్రీ రంగారావు, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల ఉపాధ్యాయులు నాగ శ్రీనివాస్, శ్రీను, సునీత, శివ విద్యార్థుల అభ్యసన స్థాయిలను తల్లిదండ్రులకు వివరించారు. భారీ సంఖ్యలో విచ్చేసిన పిల్లల తల్లిదండ్రులు సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని, ఉపాధ్యాయులతో తమ పిల్లల చదువుల గురించి చర్చించారు.










