చీరాల, 2026-08-25
రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల ఆధ్వర్యంలో వాడరేవు మండల ప్రాథమిక పాఠశాలలో 370 మంది విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. రూ.37,500 విలువైన నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, జామెండ్రి బాక్సులు, రబ్బర్లు వంటివి అందజేశారు. విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లను కూడా అందించారు.

అభినందనలు తెలిపిన హెడ్మాస్టర్
ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ రామాంజనిదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలతో పాటు రోటరీ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులకు అందిస్తున్న సహాయం అభినందనీయమన్నారు.
విద్యార్థులకు సూచనలు
రోటరీ క్లబ్ అధ్యక్షులు తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ చందలూరి బాల వెంకటేశ్వరరావు, కోశాధికారి పోలుదాసు రామకృష్ణ, అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఐ.బాబూరావు, జి.వై. ప్రసాద్, గుర్రం రాఘవరావు, డి.వి. సురేష్, ఎస్.వి. స్వామి, జలపాటి పుల్లయ్యనాయుడు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.