Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 14
స్వర్ణ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఆత్మహత్యల నివారణ, బాలల హక్కులు, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. కిడ్స్ ఎన్జీఓ, మహిళా శిశు సంక్షేమ శాఖ (ICDS) సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కోవడం, సహాయం కోరడం గురించి వివరించారు.
స్వర్ణ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు 'పిల్లల్లో ఆత్మహత్యల నివారణ'పై అవగాహన కార్యక్రమం జరిగింది. కిడ్స్ ఎన్జీఓ, మహిళా శిశు సంక్షేమ శాఖ (ICDS) సీడీపీఓ కార్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
నేటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, మానసిక ఆరోగ్య నిపుణుల సహకారం తీసుకోవాలని, ఆత్మహత్య పరిష్కారం కాదని వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ – 1098, జాతీయ మానసిక ఆరోగ్య సహాయ హెల్ప్‌లైన్ – 14416 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జీవితం అమూల్యమైనదని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని అవగాహన కల్పించారు.
బాలల హక్కులు, లైంగిక వేధింపుల నివారణ, POCSO చట్టం, సైబర్ భద్రత, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో అధిక సమయం గడపకుండా, విద్య, క్రీడలు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించి లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు, కిడ్స్ ఎన్జీఓ సభ్యులు డేవిడ్ గారు, ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీమతి జి. సులోచనారాణి పాల్గొన్నారు. విద్యార్థులతో పరస్పరం మాట్లాడి, వారి సందేహాలను నివృత్తి చేస్తూ, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అవసరమైన సమయంలో సహాయం కోరడం, బాలల హక్కులను తెలుసుకోవడం, సురక్షితమైన భవిష్యత్తు కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.









