లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస ప్రధాన ఫాంటసీ చిత్రం మహాశక్తి ట్రైలర్ విడుదలైంది. తమిళంలో మూకుత్తి అమ్మన్ 2 పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించారు. దేవతా శక్తులు, మాంత్రిక శక్తుల మధ్య జరిగే పోరాటాన్ని ప్రతిబింబించేలా ట్రైలర్‌ను రూపొందించారు.
ఇందులో నయనతార అమ్మవారి రూపంలో కనిపించగా, నటి రెజీనా కసాండ్రా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఆకట్టుకున్నారు. ట్రైలర్లో గత కాలానికి, ప్రస్తుత కాలానికి మధ్య సంబంధాన్ని చూపిస్తూ కథను ఆసక్తికరంగా పరిచయం చేశారు. ఓ రాజ్యం, యువరాజు చుట్టూ చోటుచేసుకునే పరిణామాలు, వాటిని ప్రభావితం చేసే అతీంద్రియ శక్తులు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి.
దైవశక్తి వర్సెస్ మాంత్రిక శక్తులు
నయనతార పాత్ర దైవశక్తికి ప్రతీకగా నిలవగా, రెజీనా పాత్ర మంత్రతంత్రాలతో కూడిన ప్రతికూల శక్తిని ప్రతిబింబిస్తున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. అయితే కథలోని పూర్తి వివరాలను చిత్రబృందం వెల్లడించలేదు. ఈ సినిమాలో నయనతార, రెజీనా కసాండ్రాతో పాటు ఊర్వశి, యోగిబాబు, దునియా విజయ్ తదితరులు నటిస్తున్నారు.
భారీ అంచనాలతో విడుదల
హిప్హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నారు. 2020లో విడుదలైన మూకుత్తి అమ్మన్ చిత్రానికి ఇది కొనసాగింపుగా రూపొందుతోంది. మొదటి భాగానికి భిన్నంగా ఈసారి భారీ దృశ్యాలు, పౌరాణిక అంశాలు, యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మహాశక్తి చిత్రాన్ని దీపావళి సందర్భంగా న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్రైలర్ విడుదలతో నయనతార అభిమానుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది.












