అర్నబ్ తుఫాన్ ప్రభావంతో న గాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో న గాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తడిసిన స్తంభాలు, స్విచ్‌బోర్డులు, మోటార్లు, విద్యుత్ పరికరాలను తాకరాదని హెచ్చరించారు. తెగిపోయిన తీగలు, లైన్లపై పడిన చెట్ల కొమ్మలకు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లలను వైర్లు, విద్యుత్ పరికరాల దగ్గరకు వెళ్లనివ్వరాదని తెలిపారు. ఉరుములు, మెరుపుల సమయంలో డిష్ కనెక్షన్ తొలగించి, అవసరమైన పరికరాలను స్విచ్ ఆఫ్ చేయాలని కోరారు. దెబ్బతిన్న సర్వీస్ వైర్లను వెంటనే , , , , సబ్‌స్టేషన్, లేదా 1912కు తెలియజేయాలని సూచించారు. అప్రమత్తతే రక్షణ అని అధికారులు పేర్కొన్నారు.












