అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధుల సభకు భారతీయ అమెరికన్ మహిళ పూజా సేథీ ఎన్నికయ్యారు. 2023న జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా టెక్సాస్ హౌస్ డిస్ట్రిక్ట్ 47 నుంచి పోటీ చేసిన ఆమె విజయం సాధించారు.
ఈ విజయంతో టెక్సాస్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళగా, తొలి ఆసియా అమెరికన్ డెమొక్రటిక్ మహిళగా చరిత్ర సృష్టించారు. పూజా సేథీ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గతంలో టెక్సాస్ ప్రతినిధి విక్కీ గుడ్విన్ వద్ద చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రత, సిరాక్యూస్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, వైద్య సేవల అందుబాటు, రహదారులు, మౌలిక సదుపాయాల మెరుగుదల తన ప్రధాన ప్రాధాన్యతలని ఆమె పేర్కొన్నారు. 2024న కొత్త శాసనసభ బాధ్యతలు చేపట్టనుంది.



