ఎమ్మార్పీఎస్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 14
దళిత, గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, కుల వివక్షకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. రాయదుర్గం పట్టణ సీఐ దేవానంద్ ను కలిసి ఆయన వినతి పత్రం అందించారు.
దళిత, గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి అన్నారు. శనివారం రాయదుర్గం పట్టణ సీఐ దేవానంద్ ను కలిసి, ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. పట్టణంలోని కోతి గుట్టలో అనుమానస్పదంగా మృతి చెందిన హరిజన మల్లేష్ మరణంపై సమగ్ర విచారణ జరపాలని తెలిపారు. అలాగే, దళిత, గిరిజనుల పట్ల నేటికీ కుల వివక్ష చూపుతున్న చర్యలున్నాయని, వాటిని అరికట్టాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనం ప్రదర్శించడం దుర్మార్గమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య భారతదేశంలో దళిత, గిరిజనులు తీవ్రమైన అణచివేత, దోపిడీ, పీడనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గమైన కుల వివక్షతలకు వ్యతిరేకంగా చట్ట ప్రకారం పోరాడుతామని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్షతను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేసే విధంగా సామాజిక చైతన్య సదస్సులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకుడు ఉలిగప్ప, సీనియర్ నాయకులు మర్ధానప్ప, ఏపీ జిల్లా ఉపాధ్యక్షులు గోవిందు, బాధితులు మల్లికార్జున, ఈశ్వరు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


