కొల్లూరు, 23 September
కొల్లూరు మండలం, గ్రామం ఉప్పు బజార్లో నివాసం ఉంటున్న కనకచర్ల శ్రీనివాస్, చిట్టయ్య అనే వ్యక్తుల ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లను అధికారులు పట్టుకున్నారు. గృహ అవసరాలకు వాడే 13 సిలిండర్లు, 3 కమర్షియల్ సిలిండర్లు చొప్పున మొత్తం 16 సిలిండర్లను అనధికారికంగా నిల్వ చేసినట్లు గుర్తించారు.
కొల్లూరు మండలం, గ్రామం ఉప్పు బజార్ లో నివాసం ఉంటున్న కనకచర్ల శ్రీనివాస్, చిట్టయ్య అనే వ్యక్తుల ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను అధికారులు పట్టుకున్నారు. గృహ అవసరాలకు వాడే 13 సిలిండర్లు, 3 కమర్షియల్ సిలిండర్లు చొప్పున మొత్తం 16 సిలిండర్లను అనధికారికంగా నిల్వ చేసినట్లు గుర్తించారు.
ఈ మేరకు బాపట్ల జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఏ. జగన్మోహన్ రావు, సీఎస్ డీటీ సివిల్ ఫణికుమార్, గ్రామ రెవెన్యూ అధికారి రామారావు తదితరులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వాటిని సీజ్ చేశారు. సీజ్ చేసిన సిలిండర్లను భద్రతా నిమిత్తం లోని వసుంధర ఇండియన్ గ్యాస్ కంపెనీకి రసీదు పొంది అప్పగించినట్లు అధికారులు తెలిపారు.



