చీరాల, 2026-11-27
బుల్లవారిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గవిని నారాయణ, గ్రామ అభివృద్ధికి అవకాశం కల్పించి సర్పంచ్‌గా గెలిపించాలని ఓటర్లను కోరారు.
బుల్లవారిపాలెం గ్రామంలోనే పుట్టి పెరిగిన తనకు, గ్రామంలోని ప్రతి ప్రాంతం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, గ్రామ అభివృద్ధికి ఒక్క అవకాశం కల్పించి సర్పంచ్‌గా గెలిపించాలని బుర్లవారిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గవిని నారాయణ ఓటర్లను అభ్యర్థించారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, మీ ఇంటి పెద్ద బిడ్డగా ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
శుక్రవారం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో బుర్లవారిపాలెం గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. గ్రామ అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా గవిని నారాయణ మాట్లాడుతూ గ్రామం నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా కనెక్టివిటీ రోడ్డు నిర్మాణం చేపట్టడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలోని అంతర్గత రహదారుల అభివృద్ధి, మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించడం, తాగునీరు, సాగునీటి సమస్యలు లేకుండా చూడటం, విద్యుత్ వోల్టేజ్ సమస్య లేకుండా చేయడం వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు అందేలా కృషి చేస్తానని, అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు అందని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామంలోని స్మశానవాటికల అభివృద్ధి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
గ్రామంలో కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కారానికి చొరవ చూపుతానని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు.
ఈ నెల 29వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే పోలింగ్‌లో, ఎన్నికల సంఘం తనకు కేటాయించిన ప్రాధాన్యత క్రమంలో నంబర్ 1 మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గవిని నారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో గవిని నారాయణ అనుచరులు, ఎస్సీ కాలనీ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



