నెల్లూరు గ్రామీణం, 2026-11-29
సివిల్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సీఎల్ఈఎస్ఏ ఏపీ) ప్రతినిధులు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను నెల్లూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా 26 జిల్లాలకు చెందిన 4,000 మందికి పైగా ఎల్టీపీలను ఏకం చేసిన అసోసియేషన్ను మంత్రి అభినందించారు.
సివిల్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సీఎల్ఈఎస్ఏ ఏపీ) రాష్ట్ర అధ్యక్షులు కమలాకర రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను ఆదివారం సాయంత్రం నెల్లూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 26 జిల్లాలకు చెందిన 4,000 మందికి పైగా లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్టీపీలను) ఏకం చేయడంపై అసోసియేషన్ను మంత్రి అభినందించారు.
పట్టణాభివృద్ధిలో ఎల్టీపీల పాత్ర
ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం, సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ అమలులో ఎల్టీపీల పాత్ర ఎంతో కీలకమని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సివిట్ / డీపీఎంఎస్ 2.0 సాఫ్ట్వేర్ లోపాలు, ప్రీడీసీఆర్/ఆటోడీసీఆర్ స్క్రూటినీ వేగం, పీడీఎఫ్ జనరేషన్, బీపీఎస్/ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు.
సానుకూల స్పందన
ఎల్టీపీల వృత్తిపరమైన రక్షణ, జీవోల సమీక్ష మరియు సీఎల్ఈఎస్ఏ ఏపీ అధికారిక గుర్తింపు వంటి అంశాలను అధికారులు, సాంకేతిక నిపుణులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఈ సమావేశం పట్టణాభివృద్ధిలో సాంకేతిక నిపుణుల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని అసోసియేషన్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.







