ఆదోని, 2026-11-28
ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బీసీ నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు, గౌరవ అధ్యక్షులు పి.సాయిబాబ, తాలూకా అధ్యక్షులు మరియాని చెన్నబసప్ప, డివిజన్ ఉపాధ్యక్షులు దేవి శెట్టి ప్రకాష్, కత్తి హనుమంతరావు, స్టూడెంట్ లీడర్ హరికృష్ణ, బండారి రాజేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జయరాముడు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ప్రతి సంవత్సరం జరుపుకుంటారని తెలిపారు. ఆయన (జననం 1827, మరణం 1890) మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలన, సమానత్వం కోసం 1873లో సత్యశోధన సమాజ్ స్థాపించారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే 1848లో పూణేలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఆయన, అన్ని మతాలు, కులాల ప్రజలు చేరేలా సామాజిక సంస్కరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన, ఆయన భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. మహిళలకు, తక్కువ కులాల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ఆయన ప్రసిద్ధి చెందారు. పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించారు. వితంతువుల కోసం కూడా పాఠశాలలు స్థాపించారు. భారతదేశంలో బాలికల కోసం పాఠశాల ప్రారంభించిన తొలి భారతీయులలో ఈ దంపతులు ఒకరు. ఈ కార్యక్రమంలో తాలూకా గౌరవ సలహాదారులు వీరభద్ర, సరోదే హరీష్, బి.మల్లేశ్వరప్ప, రంగస్వామి, కటిక సుధీర్, కత్తి ప్రసాద్, సుబ్రహ్మణ్యం, గోపాల్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.







