బాపట్ల, 2026-11-14
బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి వేటపాలెంకు చెందిన సీనియర్ సిటిజన్లు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కర్ల సుబ్బారావు, ప్రజా గాయకుడు ఎస్.ఎం. షరీఫ్ 18 పుస్తకాలను విరాళంగా అందించారు. కలెక్టర్ పిలుపునకు స్పందించి ఈ పుస్తకాలను అందజేశారు.
బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నూతనంగా ప్రారంభించిన గ్రంథాలయానికి వేటపాలెంకు చెందిన సీనియర్ సిటిజన్లు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కర్ల సుబ్బారావు, ప్రజా గాయకుడు ఎస్.ఎం. షరీఫ్ 18 పుస్తకాలను విరాళంగా అందించారు. కలెక్టరేట్ గ్రంథాలయ అభివృద్ధికి పుస్తకాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఇచ్చిన పిలుపునకు స్పందించి, పత్రికల్లో వచ్చిన వార్తలను చూసిన వేటపాలెం సీనియర్ సిటిజన్లు శనివారం కలెక్టరేట్‌కు చేరుకుని స్వయంగా కలెక్టర్‌కు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికత, సనాతన ధర్మం తదితర అంశాలకు సంబంధించిన 18 పుస్తకాలను గ్రంథాలయానికి అందించారు.
అనంతరం కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ మాట్లాడుతూ, గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు పఠనాభిరుచిని అభివృద్ధి చేస్తాయని తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రంథాలయానికి ఉపయోగకరమైన పుస్తకాలను అందించాలని కోరారు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయ అభివృద్ధికి స్పందించి పుస్తకాలను విరాళంగా అందించిన కర్ల సుబ్బారావు, ఎస్.ఎం. షరీఫ్‌లను కలెక్టర్ అభినందించారు.


