లక్కిరెడ్డిపల్లె, 14 November
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మద్దిరేవుల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతనంగా పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు టీడీపీ వైపు వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోనమల ఖాదరవల్లి, జడ్పీటీసీ యనమల మదన్ మోహన్, రాష్ట్ర ఫారెస్ట్ డైరెక్టర్ రెడ్డయ్య యాదవ్, మాజీ ఎంపీపీ అంపాబతిన రెడ్డయ్యతో పాటు ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






