ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, 2026-11-26
నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి, మెప్మా ఆర్పీలు, సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ సచివాలయంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి మెప్మా () ఆర్పీలు, సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరు, మహిళలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు, స్త్రీనిధి, వీధి వ్యాపారులకు అందిస్తున్న పథకం, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు.
డివిజన్లో ఉన్న మహిళా సంఘాల సంఖ్య, వాటి పనితీరు, సభ్యులకు అందుతున్న ఆర్థిక సహాయం, పెండింగ్లో ఉన్న రుణ దరఖాస్తులు, అర్హులైనప్పటికీ ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారుల వివరాలను కార్పొరేటర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలని, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించే మార్గాలను అన్వేషించాలని కార్పొరేటర్ సూచించారు. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ప్రభుత్వ పథకాల ద్వారా అందాల్సిన ఆర్థిక సహాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కోరారు.
అభివృద్ధికి కృషి చేస్తాం
ఈ సందర్భంగా కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రజా సేవా స్ఫూర్తితో, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారి సహకారం, మార్గదర్శకత్వంలో డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, 21వ డివిజన్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని కార్పొరేటర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, మెప్మా అధికారులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని అన్నారు. మహిళా సాధికారత, పేద కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని కార్పొరేటర్ తెలిపారు. డివిజన్లోని ప్రతి ప్రాంతంలో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, 21వ డివిజన్ కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి, నరహరి, బాలు, ఆమని, బాలాజీ, విజయ్, శ్రీలక్ష్మి, మెప్మా ఆర్పీలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



