కార్యక్రమంలో (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 23
బి.కొత్తకోటలో మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం నియమించిన 221 మంది మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ పూర్తయింది, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని జనరల్ అబ్జర్వర్ సూచించారు.
బి.కొత్తకోట మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నియమించిన 221 మంది మైక్రో అబ్జర్వర్లకు సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమం పూర్తయింది. మదనపల్లెలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జి. బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరై, మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు.
ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని ఆయన తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.


