నరసరావుపేట, నరసరావుపేట, పల్నాడు, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 14
నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలిరోజు 55 పత్రాలు దాఖలయ్యాయి.
నరసరావుపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ తొలిరోజైన శనివారం అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ వివరాలను మున్సిపల్ కమిషనర్ బి. రమ్య కీర్తన ఒక ప్రకటనలో వెల్లడించారు.
తొలిరోజు వివిధ ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల నుంచి మొత్తం 55 నామినేషన్లు దాఖలైనట్లు కమిషనర్ తెలిపారు. పార్టీల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలు: వైఎస్సార్సీపీ: 40 తెలుగుదేశం పార్టీ: 10 జనసేన: 2 బీఎస్పీ: 1 కాంగ్రెస్: 1 ఇతరులు (స్వతంత్రులు): 1
తొలిరోజు ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా సాగిందని, మొత్తంగా 55 నామినేషన్ పత్రాలు అందినట్లు ఆమె పేర్కొన్నారు.






