త్రిపురాంతకం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 14
పుస్తక పఠనంతో విజ్ఞానం వికసిస్తుందని, గ్రంథాలయాలు జ్ఞాన సంపదకు నిలయాలని చాటిచెబుతూ, మార్కాపురం జిల్లా మండలంలోని స్థానిక శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
పుస్తక పఠనంతోనే విజ్ఞానం వికసిస్తుందని, గ్రంథాలయాలు జ్ఞాన సంపదకు నిలయాలని చాటిచెబుతూ, మార్కాపురం జిల్లా మండలంలోని స్థానిక శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ ఆదేశాల మేరకు, స్థానిక గ్రంథపాలకులు జి. రామాంజి నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా, భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి మరియు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథపాలకులు రామాంజి నాయక్ మాట్లాడుతూ, నెహ్రూ దేశభక్తి, దూరదృష్టి, దేశాభివృద్ధికి చేసిన విశేష సేవలను కొనియాడారు. బాలలంటే నెహ్రూకు ఎంతో ప్రేమ అని, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం విద్య, విజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం, 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రాధాన్యతను వివరిస్తూ, విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని విస్తరించడం, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనంతరం, విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి, వారిలోని కళాత్మక ప్రతిభను వెలికితీశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, శ్రీశ్రీ కళావేదిక జాతీయ సహాయ కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య, గురునాధం తదితరులు పాల్గొన్నారు. పుస్తకం చేతిలో ఉంటే విజ్ఞానం తోడవుతుంది. గ్రంథాలయం అందుబాటులో ఉంటే భవిష్యత్తుకు బాట పడుతుంది అనే సందేశంతో ఈ ప్రారంభోత్సవం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.


