చంద్రగిరి, 2026-11-26
చంద్రగిరిలోని ....
చంద్రగిరిలోని .... బాలికల ఉన్నత పాఠశాలలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి మండల విద్యాశాఖాధికారి () శ్రీమతి . లలిత కుమారి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించారు. అనంతరం రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రాథమిక హక్కులు, పౌరుల విధులు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ముఖ్య అతిథి సందేశం
కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీమతి . లలిత కుమారి గారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది. ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి. విద్యార్థినులు రాజ్యాంగ స్ఫూర్తిని తమ నిత్య జీవితంలో ఆచరిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు.
అనంతరం, రాజ్యాంగం పట్ల గౌరవం, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతను పెంపొందించుకోవాలని ఉపాధ్యాయులు, విద్యార్థినులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకట్రమణారెడ్డి గారు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు శ్రీమతి జాయ్సీ రమాదేవి గారు, ఇతర ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





