చీరాల, 27 September
మార్గదర్శకాలకు అనుగుణంగా చీరాల పురపాలక సంఘ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 44 వార్డులకు సంబంధించి 88 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ మేరకు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా చీరాల పురపాలక సంఘ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 44 వార్డులకు సంబంధించి 88 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ మేరకు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించారు.
రాజకీయ పార్టీలతో సమావేశం
ఈ నేపథ్యంలో చీరాల మున్సిపల్ కమిషనర్ కే. డానియల్ జోసెఫ్ ఆధ్వర్యంలో శనివారం చీరాల మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో నూతన 44 వార్డులకు సంబంధించి రూపొందించిన 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందుబాటులో ఉంచి పరిశీలించేందుకు అవకాశం కల్పించారు.
ముసాయిదా జాబితాను పరిశీలించిన అనంతరం ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా తెలియజేయాలని కమిషనర్ డానియల్ జోసెఫ్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.











