అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ లో 16 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ఒక ఉపాధ్యాయుడు మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
ఓరెగాన్ రాష్ట్రంలోని బెండ్ నగరంలో జరిగిన ఈ కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. లోకి ప్రవేశించిన 16 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ఐదు, ఎనిమిది, పదకొండు సంవత్సరాల వయసున్న ముగ్గురు చిన్నారులు, ఒక ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడేళ్ల చిన్నారి, 54 ఏళ్ల ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానిక వ్యక్తి ప్రతిఘటనతో దుండగుడు మృతి
లోకి ప్రవేశించిన బాలుడిని గమనించిన ఓ స్థానిక వ్యక్తి అతడిని వెంబడించి, కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడు అక్కడికక్కడే మరణించాడు. అతడిని బెండ్ నగరానికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అయితే అతడికి తో ఏదైనా సంబంధం ఉందా, దాడికి కారణాలేమిటి అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలింపు
ఘటన అనంతరం లోని విద్యార్థులను సమీపంలోని చర్చికి తరలించి, వారి తల్లిదండ్రులతో కలిపేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత దృష్ట్యా బెండ్-లా పైన్ జిల్లాలోని మొత్తం 32 ల్లో న తరగతులు, క్రీడా కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలను రద్దు చేశారు.
ఒరెగాన్ గవర్నర్ టీనా కోటెక్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానిక వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసించారు.
దర్యాప్తు కొనసాగింపు
కాల్పులకు ఉపయోగించిన తుపాకీని నిందితుడి తల్లి చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు, దర్యాప్తు గురించి తెలిసిన ఓ అధికారి వెల్లడించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. అయితే దాడి వెనుక ఉద్దేశం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు ఘటనకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నాయి. ల్లో విద్యార్థుల భద్రత, తుపాకీ హింస నివారణపై ఈ ఘటన మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.












