మార్టూరులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మార్టూరులో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అర్జీదారులను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన వినతిపత్రాలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.












