మురసు తుఫాను జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. పలు సూచనలు జారీ చేశారు. తుఫాను కారణంగా జిల్లాలో వాతావరణం అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
తుఫాను హెచ్చరిక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. చేపలు పట్టే వారు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. సహాయక చర్యల కోసం బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా, అధికారుల సూచనలను పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. తుఫాను ప్రభావం వలన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, అటువంటి పరిస్థితుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి సంఘటనలు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రతకు యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.











