పిలుపుతో (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 15
బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి అధికారులు పుస్తకాలను బహుకరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పిలుపునకు స్పందించి, సర్వశిక్ష అభియాన్ ఏపీసి. శ్రీనివాసులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి బెన్హర్ కలిసి 8 పుస్తకాలను కలెక్టర్కు అందజేశారు.
బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నూతనంగా ప్రారంభించిన గ్రంథాలయానికి అధికారులు పుస్తకాలను బహుకరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పిలుపునకు స్పందించి ఈ చర్య చేపట్టారు. సర్వశిక్ష అభియాన్ ఏపీసి. శ్రీనివాసులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి బెన్హర్ కలిసి మొత్తం 8 పుస్తకాలను జిల్లా కలెక్టర్కు అందజేశారు.
జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు, పఠనాభిరుచిని పెంపొందించే ఉద్దేశంతో ఉపయోగకరమైన పుస్తకాలను అందించాలని కలెక్టర్ గతంలో జిల్లా అధికారులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పత్రికల్లో ప్రచురితమైన వార్తలకు స్పందించిన అధికారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు రామాయణంలోని సుందరకాండ, భగవద్గీత, సనాతన ధర్మం తదితర ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన పుస్తకాలను కలెక్టర్కు సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ మాట్లాడుతూ, గ్రంథాలయానికి జిల్లా అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విలువైన, విజ్ఞానదాయకమైన పుస్తకాలను అందించాలని కోరారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, విజ్ఞానం పెంపొందించుకోవచ్చని, గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


