జరగాలని (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత ధరలకు అనుగుణంగానే జరగాలని, ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సరైన అనుమతులు లేకుండా పొగాకు సాగు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అటువంటి రైతులకు ప్రభుత్వ నిర్దేశిత ధరలు చెల్లించబడవని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత ధరలకు అనుగుణంగానే జరగాలని, ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సరైన అనుమతులు లేకుండా పొగాకు సాగు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అటువంటి రైతులకు ప్రభుత్వ నిర్దేశిత ధరలు చెల్లించబడవని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, పొగాకు బోర్డు ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పొగాకు సాగు విస్తీర్ణం అనవసరంగా పెరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించి ఎంతమంది రైతులు పొగాకు సాగు చేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో పంట వేశారు అనే వివరాలను సేకరించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా సాగు చేసే రైతుల వివరాలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద వ్యవసాయ శాఖ ప్రత్యేక అధికారులను నియమించినట్లు వెల్లడించారు. రైతులు కొనుగోళ్లకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే అక్కడ అందుబాటులో ఉన్న అధికారులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొనుగోళ్లు చేపట్టేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రానున్న తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి. రాజాబాబు ఆదేశించారు. ఆస్తి నష్టం, ప్రాణనష్టం, ప్రజల జీవనానికి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించాలని, పంట నష్టాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యంగా పంట పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.
మత్స్యకారులను ముందుగానే అప్రమత్తం చేయాలని, వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన బోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వినియోగించే బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. తుఫాను సమయంలో సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా సెల్ టవర్ల వద్ద విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైన చోట జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని విద్యుత్, సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రజలకు అత్యవసర సమాచారం నిరంతరం చేరేలా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఉద్యానవన శాఖ అధికారి గోపీనాథ్, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, పొగాకు బోర్డు ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

