మార్కాపురం, 17 November
సాహిత్యం, సంగీతం, సంస్కృతి, కళలకు వేదికగా విజయనగరంలో అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మంగళవారం 177వ జాతీయ సాహిత్య, సంగీత, సాంస్కృతిక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా, త్రిపురాంతకం మండలానికి చెందిన ప్రముఖ రచయిత గొట్టిముక్కుల నాసరయ్యకు మెమోంటో, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
సాహిత్యం, సంగీతం, సంస్కృతి, కళలకు వేదికగా విజయనగరంలో అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 177వ జాతీయ సాహిత్య, సంగీత, సాంస్కృతిక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి కవులు, రచయితలు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రతిభను చాటుకున్నారు. సభా ప్రాంగణం సాహిత్య సౌరభాలతో, సంగీత స్వరాలతో కళకళలాడింది. ఈ సందర్భంగా జిల్లా, త్రిపురాంతకం మండలానికి చెందిన ప్రముఖ రచయిత గొట్టిముక్కుల నాసరయ్య ఈ సందర్భంగా చక్కని కవితాగానం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కళారత్న కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి జి. ఈశ్వరీభూషణం, జాతీయ ప్రణాళిక అధికారి డా. టి. పార్థసారధి, విజయనగరం జిల్లా శ్రీశ్రీ కళావేదిక కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్, శ్రీమతి గిరిజా ప్రసన్న చేతుల మీదుగా నాసరయ్యకు మెమోంటో, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
సాహిత్య రంగంలో నాసరయ్య చేస్తున్న కృషిని, సృజనాత్మక రచనలను, సాహిత్య సేవలను ఈ సందర్భంగా వారు అభినందించారు. ఈ సత్కారం త్రిపురాంతకం ప్రాంతానికి, సాహిత్యభిమానులకు గర్వకారణంగా నిలిచింది. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని, సమాజ చైతన్యమే లక్ష్యంగా రచనలు చేస్తున్న నాసరయ్యకు జాతీయ స్థాయి సాహిత్య వేదికపై లభించిన ఈ గౌరవం మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని అందించింది. ప్రతిభకు గుర్తింపు లభించినప్పుడు రచయిత కలానికి కొత్త స్ఫూర్తి కలుగుతుందనే విషయానికి ఈ సన్మానం నిదర్శనంగా నిలిచింది. సాహిత్య సేవకు లభించిన గౌరవం ఒక వ్యక్తికే కాదు, త్రిపురాంతకం ప్రాంతానికే గర్వకారణమని తెలిపారు.







