ప్రకాశం, 2026-11-17
టి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), కందుకూరులో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయడానికి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను 17-11-2026 నుండి ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యం. రవి కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
టి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), కందుకూరులో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో మిగిలిపోయి ఉన్న సీట్లలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ 17-11-2026 నుండి ప్రారంభమవుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యం. రవి కుమార్ తెలియజేశారు.
అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యుత్తమ బోధన, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం, మంచి ఫలితాలతో ప్రకాశం జిల్లాలోనే ప్రతిష్టాత్మక కళాశాలగా నిలిచిన ఈ కళాశాలలో చేరి విద్యార్థులు తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన కోరారు.
స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ
స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ద్వారా అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు కళాశాలలో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







