నంద్యాల, 14 November
సకాలంలో వర్షాలు కురవక, సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలని మండల రైతులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సకాలంలో వర్షాలు కురవక, సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలని మండల రైతులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన రైతులతో కలిసి లోని కేసీ కెనాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ () కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల వల్ల ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వెలుగోడు రిజర్వాయర్‌లో 9.5 టీఎంసీల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, అందులో కేవలం ఒక్క టీఎంసీ నీటిని కేసీ కెనాల్‌కు విడుదల చేస్తే వేలాది ఎకరాల పంటలకు ప్రాణం పోసినట్లవుతుందని తెలిపారు.
రైతుల ఆవేదన
ముఖ్యంగా జొన్న సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, మరో రెండు రోజుల్లోగా సాగునీరు అందకపోతే పంట పూర్తిగా ఎండిపోయి, అన్నదాతలు కోలుకోలేని ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతారని పేర్కొన్నారు. కళ్లెదుటే పంటలు ఎండిపోతుండటంతో రైతులు అధికారుల ఎదుట తమ గోడును వెళ్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధులు రైతుల కష్టాలను మానవతా దృక్పథంతో పరిశీలించి, యుద్ధప్రాతిపదికన అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తక్షణమే కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.


