విక్రయించాలని (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 14
చిలకలూరిపేటలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం.వి. ప్రసాద్ వ్యాపారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రకాల వారీగా నిర్దేశించిన గరిష్ఠ రిటైల్ ధరలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
చిలకలూరిపేటలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం.వి. ప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో హోల్సేల్, రిటైల్ బియ్యం వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రకాల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ఠ రిటైల్ ధరలను వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బీపీటీ-3291 (సోనా), బీపీటీ-5204 (సాంబా), కేఎన్ఎం రకాలు రూ. 66, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ రకాలు రూ. 76, జై శ్రీరామ్ రకం రూ. 82, ఎంటీయూ సాధారణ రకాలు రూ. 47 చొప్పున తెలిపారు.
ప్రతి దుకాణంలోనూ రకాలవారీగా ధరల పట్టికను ప్రదర్శించాలని, ప్యాకింగ్ సంచులపై ఎంఆర్పీని ముద్రించాలని ఆయన ఆదేశించారు. వినియోగదారుల నుంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ధరలకే విక్రయించేందుకు పూర్తి సహకారం అందిస్తామని వ్యాపారులు, రైస్ మిల్లర్లు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సంఘాల ప్రతినిధులు, వ్యాపారులు పాల్గొన్నారు.

