పల్నాడు, 14 November
మురాసు తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖ బృందం పర్యటించింది. తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలు, విద్యుత్ స్తంభాలను పరిశీలించింది.
మురాసు తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖ బృందం పర్యటించింది. నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. తుఫాన్ కారణంగా ధ్వంసమైన ఇళ్లను, నీటమునిగిన పంట పొలాలను, విరిగిపడిన విద్యుత్ స్తంభాలను పరిశీలించింది. ముఖ్యంగా బొప్పిడి గ్రామంలో తుఫాన్ ధాటికి కుప్పకూలిన ఇళ్లను పరిశీలించి, నష్ట తీవ్రతను అంచనా వేశారు. ఈ తుఫాన్ వల్ల చిలకలూరిపేట నియోజకవర్గంలో సుమారు 4700 హెక్టార్లలో పత్తి పంట దెబ్బతిందని, మొత్తం రూ. 70 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని కేంద్ర బృందం ప్రాథమికంగా తెలిపింది.
జిల్లా వ్యాప్తంగా చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో అత్యధిక శాతం నష్టం వాటిల్లిందని, 37 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయని జిల్లా కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి, బాధితులకు తగిన నష్టపరిహారం అందేలా కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందిస్తామని కేంద్ర బృందం ప్రతినిధులు స్పష్టం చేశారు.

