మంగళగిరి, తాడేపల్లి, కృష్ణా, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 11
మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను విజయవాడ నూతన మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేసి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను విజయవాడ నూతన మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేసి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు పలు అంశాలపై సౌహార్దపూర్వకంగా చర్చించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా విజయవాడ నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీ దృష్టి సారించింది. మేయర్‌గా తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో వంగవీటి రాధాకృష్ణ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ మర్యాదపూర్వక సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.






