రామకృష్ణాపురం, చీరాల (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 11
చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు.
చీరాల రామకృష్ణాపురంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చీరాల మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పట్టణ రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలకు సమావేశంలో ప్రాధాన్యత ఇచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను కరణం వెంకటేష్ బాబు ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






