బనగానపల్లె, 2026-11-27
బనగాపల్లె మండలం చెరువుపల్లె గ్రామంలో శ్రీ జై కే ఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, చెరువుపల్లె మసీదు ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెచ్ఎం నాగ సుదర్శన్, పలుకూరు కరెంట్ రాజు, సుబ్బరాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బనగాపల్లె మండలం చెరువుపల్లె గ్రామంలో శ్రీ జై కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో, చెరువుపల్లె మసీదు ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు నిర్వహించారు. సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, చిన్నపిల్లలతో పని చేయించుకోవడం చట్టరీత్యా నేరమని ఆయన అన్నారు. పిల్లలకు విద్య నేర్పిస్తే, ఆస్తి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్లేనని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే నష్టాలు, చదువుకోవడం వల్ల కలిగే లాభాలను బ్రహ్మానంద చారి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెచ్ఎం నాగ సుదర్శన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సదుపాయాలను, విద్యా విశిష్టతను వివరించారు. అనంతరం విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం నాగ సుదర్శన్, పలుకూరు కరెంట్ రాజు, సుబ్బరాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



