చీరాల, 2026-11-26
బాపట్ల జిల్లాలో ఈ నెల 29వ తేదీన ఏడు మండలాల్లో నిర్వహించనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బంది కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారుల కేటాయింపునకు రెండో విడత రాండమైజేషన్ ప్రక్రియను గురువారం పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
బాపట్ల జిల్లాలో ఈ నెల 29వ తేదీన ఏడు మండలాల్లో నిర్వహించనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బంది కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు), ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓలు) కేటాయింపునకు సంబంధించి రెండో విడత రాండమైజేషన్ ప్రక్రియను గురువారం పూర్తి చేశారు. జిల్లా కలెక్టరేట్లోని బోర్డు రూమ్లో జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు ఏఏఎల్ పద్మావతి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 29న జిల్లాలోని ఏడు మండలాల్లో జరగనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకతకు మరియు నిష్పాక్షికతకు ప్రాధాన్యతనిస్తూ రాండమైజేషన్ ద్వారా సిబ్బందిని ఆయా మండలాలకు కేటాయించినట్లు వివరించారు. ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి చిన్నపాటి పొరపాట్లకు కూడా తావులేకుండా, తమకు అప్పగించిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నరేష్ కుమారి, డీఈఓ శ్రీనివాస్ సింగ్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


