క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-22
బాపట్ల పురపాలక ఎన్నికల ప్రచారంలో రాజకీయ వేడి రాజుకుంది.
బాపట్ల పురపాలక ఎన్నికల ప్రచారంలో రాజకీయ వేడి రాజుకుంది. బాపట్ల పట్టణంలోని 20, 21, 23, 5వ వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తన బృందం తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా ఆయన చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అడుగడుగునా హారతులు పట్టి, శాలువాలతో సత్కరిస్తూ స్థానికులు ఘన స్వాగతం పలుకుతున్నారు.
గుర్తులపై ప్రత్యేక అవగాహన
ఓటర్లకు ఎన్నికల గుర్తులపై స్పష్టత కల్పించేందుకు అన్నం సతీష్ ప్రభాకర్ ప్రత్యేకంగా పాంప్లెట్లను చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. చైర్మన్ అభ్యర్థి పేర్లి సునీల్ కుమార్కు కప్పు - సాసర్ గుర్తు, వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థులకు గ్యాస్ సిలిండర్ గుర్తు కేటాయించిన విషయాన్ని ఇంటింటికీ వివరిస్తున్నారు. ఓటర్లు గుర్తులను గుర్తుంచుకుని తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
స్థానికుల చేతుల్లోనే అధికారం ఉండాలి
బాపట్ల ప్రజల ఆత్మగౌరవం కోసం స్థానిక అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నం సతీష్ ప్రభాకర్ ప్రచారంలో స్పష్టం చేస్తున్నారు. పట్టణ సమస్యలపై అవగాహన ఉన్న స్థానికులకే పాలనా బాధ్యతలు అప్పగిస్తే వార్డుల అభివృద్ధికి మెరుగైన కృషి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ప్రచారంలో లభిస్తున్న ఆదరణ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా ఇండిపెండెంట్ల తరఫున అన్నం సతీష్ ప్రభాకర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తుండటం ఎన్నికల సమీకరణాల్లో ఆసక్తిని పెంచుతోంది.


