బనగానపల్లె, 2026-11-20
బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో రామాలయం నందు శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి జయంతి ఉత్సవాల సందర్భంగా కాలజ్ఞాన విశిష్టతపై సదస్సు నిర్వహించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచానికి ఆదర్శమని, భూత, భవిష్యత్, వర్తమానాలను తెలియజేసిన వీరబ్రహ్మేంద్ర స్వామి మన ప్రాంతంలో నివసించడం ప్రజల అదృష్టమని ఆయన అన్నారు.
బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో రామాలయం నందు శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి జయంతి ఉత్సవాల సందర్భంగా కాలజ్ఞాన విశిష్టతపై సదస్సు నిర్వహించారు. మొదట బ్రహ్మంగారి చిత్రపటానికి పూలమాలలు వేసి, పూజలు నిర్వహించిన బ్రహ్మానంద చారి అనంతరం సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ, భూత, భవిష్యత్, వర్తమానాలను తెలియజేసిన దేవాది దేవుడు వీరబ్రహ్మేంద్ర స్వామి మన బనగానపల్లె ప్రాంతంలో నివసించడం ప్రజల అదృష్టమని అన్నారు. రవ్వల కొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, చింతమాను మఠం, నేల మఠం అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని, ఒక జిల్లాకు లేదా ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని, ఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలలో చేర్చాలని బ్రహ్మానంద చారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆంజనేయ స్వామి భక్తమండలి అధ్యక్షుడు కేఈ వెంకటసుబ్బయ్య గౌడ్ మాట్లాడుతూ, బ్రహ్మంగారు చెప్పిన వాక్యాలు ఇప్పటికీ నిజమవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్త మండల అధ్యక్షుడు కేఈ వెంకటసుబ్బయ్య గౌడ్, అంజి, ఆంజనేయస్వామి దీక్షాపరులు, బ్రహ్మంగారి భక్త బృందం పాల్గొన్నారు. అనంతరం భజన కార్యక్రమం నిర్వహించారు.


