చీరాల, 2026-08-22
శసమాచారంసమాచారంభశఉదఅతహభతసమాచారం,అతదబహత
చీరాల శాసనసభ్యులు ఎం.ఎం. కొండయ్య శనివారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు చీరాల పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న అగ్నిమాపక కేంద్రంలో నూతన అగ్నిమాపక యంత్ర వాహనం (ఫైర్ ఇంజన్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.
ప్రజాదర్బార్
అనంతరం ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు.
వైద్యుడికి నివాళి
మధ్యాహ్నం 12:30 గంటలకు ఇటీవల మృతి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ డేవిడ్ సన్ సాల్మన్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించనున్నారు.
పార్టీ పిలుపు
ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు, మహిళా నాయకులు, పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, మండల కమిటీ కార్యవర్గ సభ్యులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జులు, గ్రామ, వార్డు పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.











