సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాల, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 19
చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజ్ తైక్వాండో టోర్నమెంట్, యూనివర్సిటీ జట్టు ఎంపికలు ప్రారంభమయ్యాయి.
చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్ తైక్వాండో టోర్నమెంట్‌తో పాటు యూనివర్సిటీ జట్టు ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా వెల్లడించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీష్ బాబు మాట్లాడుతూ, జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని కళాశాలల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ కాకినాడకు చెందిన ఖాదర్ బాషా, అబ్జర్వర్‌గా తులసి పాల్గొన్నారు. సీనియర్ కోచ్‌లు సలావుద్దీన్, ప్రశాంత్ బాబు, అఖిల్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని 30 కళాశాలల నుంచి సుమారు 80 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు.
క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి యూనివర్సిటీ జట్టుకు ఎంపికయ్యేందుకు ఈ పోటీలు వేదికగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ సి. సుబ్బారావు (డైరెక్టర్ అక్రిడిటేషన్స్), ఆర్.వి. రమణమూర్తి (మేనేజర్ అడ్మినిస్ట్రేషన్), వనమా దొర నాగసాయినాథ్ (డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్), వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.







