Suryapet/Mattampally (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 23
విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం (జూలై 24న) 'మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్'ను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వివరించారు.

జిల్లాలోని మొత్తం 1772 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు మరియు 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమం జరగనుంది. పాఠశాల–కుటుంబ సంబంధాలను పటిష్టపరచడం, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, విద్యార్థుల అభ్యాసన స్థాయిలను మెరుగుపరచడం ఈ వేదిక ప్రధాన ఉద్దేశ్యాలు.
పిల్లల చదువుపై తల్లిదండ్రులు ఇద్దరికీ బాధ్యత ఉంటుందని, కాబట్టి తండ్రి, తల్లి ఇద్దరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ కోరారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి.
విద్యార్థుల హాజరు, విషయాలవారీగా అభ్యాసన స్థాయి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) పురోగతి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రోగ్రెస్ కార్డుల ద్వారా తల్లిదండ్రులకు వివరించనున్నారు.
ప్రభుత్వ విద్యా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి విద్యార్థికి అందుతున్నాయా లేదా అని పరిశీలించి, ఒకవేళ లభించకపోతే తగిన చర్యలు తీసుకుంటారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం వల్ల జరిగే అనర్థాలు, సైబర్ నేరాల పట్ల ప్రత్యేక అవగాహన కల్పిస్తారు.
ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.